శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (16:52 IST)

సుహాస్ హీరోగా ఆనందరావు అడ్వెంచర్స్

Suhas,  Rana,  Ram Kuraleti, Uday Kola, Vijay Shekhar Anne, Suresh Kothinti, Suhasini Rahul, Murali Jampana
Suhas, Rana, Ram Kuraleti, Uday Kola, Vijay Shekhar Anne, Suresh Kothinti, Suhasini Rahul, Murali Jampana
సుహాస్ హీరోగా ఆనందరావు అడ్వెంచర్స్ చిత్రం రుపొందుతోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ పసుపులేటి మెగాఫోన్ పట్టనున్నారు. ఈ ఫెయిరీ టేల్ ఫాంటసీ చిత్రాన్ని Xappie స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 4గా నిర్మించబోతోంది. ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్న,  సురేష్ కోతింటి నిర్మాతలు, సుహాసిని రాహుల్, మురళీ జంపన సహ నిర్మాతలు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, ఆనంద్ దేవరకొండ, క్రిష్, నందిని రెడ్డి, బివిఎస్ రవి హాజరయ్యారు. రానా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయగా, క్రిష్ స్క్రిప్ట్‌ను టీమ్‌కి అందజేశారు.
  
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుహాస్ తన తలపై కిరీటంతో ఫన్నీ అవతార్‌లో ఉన్నాడు మరియు అతను స్వర్గం నుండి భూమికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఫీడింగ్ బాటిల్‌ని మోస్తున్నట్లు కనిపించాడు. ఊరు స్వర్గంలా కనువిందు చేస్తోంది సుహాస్ ముఖంలో సంతృప్తి. టైటిల్ లాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.
 
ఈ సందర్భంగా సుహాస్‌ మాట్లాడుతూ, త్వరలో సినిమా ప్రారంభం కానుంది. . 2017నుంచి దర్శకుడు తెలుసు. అలా చెప్పిన 7వ కథ ఇప్పుడు వెండితెరకు ఎక్కబోతోంది. పోస్టర్‌లోనే కంటెంట్‌ తెలిసిపోయింది. నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
 
సహ నిర్మాత సుహాసిని మాట్లాడుతూ, మంచి కథతో మీముందుకు వస్తున్నాం. మాకు స్పూర్తి అయిన రానాగారు వచ్చి ఆశీస్సులు అందించడం ఆనందంగా వుంది అని చెప్పారు.
కథ, మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం చేస్తున్న రామ్ పసుపులేటి మాట్లాడుతూ, చిల్డ్రన్ ఫాంటసీ కథ తో తెరకెక్కుతుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరోకు ధన్యవాదాలు తెలిపారు.
 
 మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా, రాకేష్ ఎస్ నారాయణ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్.