మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 మార్చి 2023 (20:23 IST)

జెఫ్రీ ద జిరాఫీని మీరు చూశారా?

Jefri
నేడు హైదరాబాద్‌ వాసులు తమ కళ్లను అస్సలు నమ్మలేకపోయారు? ఎందుకంటే వారంతా కూడా నగరంలో అత్యత కీలకమైన ప్రాంతాలలో జెఫ్రీని చూశారు! అందరితోనూ ఎంతో స్నేహంగా ఉండే ఈ జిరాఫీని తొలుత ఎయిర్‌పోర్ట్‌లో చూసిన నగరవాసులు, ఆ తరువాత హుస్సేన్‌ సాగర్‌ తీరాన విశ్రాంతి తీసుకుంటూ, అలల అందాలను ఆస్వాదించింది. అక్కడ నుంచి పురాతన కట్టడం చార్మినార్‌కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ జిరాఫీ ఆ తరువాత హైటెక్‌ సిటీ, రామోజీఫిలిం సిటీని కూడా సందర్శించనుంది!
 
వీక్షకులను, మీ చుట్టుపక్కల ఫ్రెండ్లీగా ఉండే జిరాఫీని చూశారా అని అడిగితే, ఆ జిరాఫీ పిల్లలతో కలిసి ఆడుకుంటుండటం తాము చూశామని, వారిని ఆశ్చర్యచకితులను చేసే చేష్టలతో చంద్రునిపైకి వెళ్తున్నట్లుగా కనిపించింది అని చెబుతారు. అసలు, ఏమిటీ ఈ గందరళగోళం అని మీరు ఆశ్చర్యపోతుంటే మాత్రం, ఆర్.యు స్టోర్‌కు వెళ్లడమే! మాదాపూర్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ వద్ద ఈ శనివారం, మార్చి 11 వ తేదీన మీరు రండి. జెఫ్రీ ద జిరాఫీని కలుసుకోవడం మాత్రమే కాదు., అదృష్టవంతులూ కావొచ్చు!