సోమవారం, 14 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఏప్రియల్ 2025 (09:17 IST)

20 కోట్ల చెల్లింపు సబ్‌స్క్రైబర్లతో జియో హాట్‌స్టార్ అదుర్స్

JioHotstar
జియో హాట్‌స్టార్ 20 కోట్ల చెల్లింపు సబ్‌స్క్రైబర్ బేస్‌ను సాధించి, నెట్‌ఫ్లిక్స్- ప్రైమ్ వీడియో తర్వాత మూడవ అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. ఈ మైలురాయి సాధనకు ప్రధానంగా కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌ల మల్టీ లాంగ్వేజ్ కవరేజ్ దోహదపడింది. 
 
జియో హాట్‌స్టార్ అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా మారడంతో, మార్కెట్ లీడర్ల మధ్య పోటీ మరింత తీవ్రమవుతోంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇప్పటికే తమ సబ్‌స్క్రైబర్ బేస్‌లను నిలుపుకోవడానికి, విస్తరించడానికి తమ వ్యూహాలను పదును పెట్టాయి.
 
గ్రామీణ ప్రాంతాలలో 5G స్ట్రీమింగ్‌తో పాటు చౌకైన డేటా రేట్లు, చౌకైన మొబైల్ ఫోన్లు, టెలివిజన్ సెట్‌ల లభ్యతతో అత్యంత పోటీతత్వ ఓటీటీ మార్కెట్ మరింత విస్తరణ వైపు పయనిస్తుందని సంస్థ విశ్వసిస్తోంది.