Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ
Dil Raju and Harshit Reddy met with a delegation from the Australian Consulate General
ఇరు దేశాల మధ్య సినిమా సహ నిర్మాణాలు (co-productions), సాంస్కృతిక కార్యక్రమాలు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల మారకము (talent exchange) వంటి పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంపైనా, తెలుగు సినిమాపైనా ఆస్ట్రేలియా ప్రతినిధులు ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపించారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల సృజనాత్మక రంగాల మధ్య బంధం మరింత బలపడుతుందని, ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఇరు పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ గా వున్నారు. ఆ హోదాలో ఆయన కలిశారు. షూటింగ్ కు సంబంధించిన విషయాలు చర్చించారు. సబ్సిడీ విషయాలు చర్చకు వచ్చాయి.

