మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!
చాలా మందికి మరుగుదొడ్డికి వెళ్ళి మొబైల్ చూడటం ఓ వ్యసనంగా ఉంటుంది. మరికొందరు లెట్రిన్‌లో కూర్చొని పేపర్ చేతిలో పట్టుకుంటేగానీ మలవిసర్జన చేయలేరు. కొంతకాలానికి ఇది ఓ వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యసనంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
మొబైల్ ఫోనుతో బాత్రూంకు తీసుకెళ్లే అలవాటు మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియాను బాత్రూమ్ నుంచి ఇంట్లోకి తీసుకొస్తారు. ఇది పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెపుతున్నారు.
అసలే కరోనా వైరస్ లాంటి వ్యాధులు ప్రపంచ దేశాలను కలవరవపాటుకు గురిచేశాయి. ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం సృష్టించాయి. గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే పైల్స్ సమస్య ఇపుడు యువతలో కూడా కనిపిస్తుంది. పైల్స్ సమస్య కారణంగా మీ మొబైల్స్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం చేస్తుంటారు.
అయితే, మీరు మొబైల్‌తో బాత్రూమ్‌ల కూర్చొన్నపుడు, ఫోనుపైన మీ పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఈ కారణంగానే మీరు సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం మరుగుదొడ్డిలోనే ఉండే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల హేమెరాయిడ్స్ అంటే పైల్స్ వచ్చే ప్రమాదం పెంచుతుంది. కాబట్టి ఇకనైనా మొబైల్ ఫోనును టాయిలెట్‍లోకి తీసుకెళ్లకండి.