AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !
A 22, A 26 news\
అట్లీ సినిమా అంటేనే యాక్షన్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో వుంటుందని అభిమానులకు తెలిసిందే. ఈ సినిమా కూడా అలానే వుంటుందనే టాక్ కూడా వుంది. అయితే ఆ యాక్షన్ పార్ట్ కూడా పర్యావనానికి సంబంధించిన అంశంగా వుండబోతోందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో జీ స్టుడియోస్ కంపెనీ కూడా కాంబినేషన్ లో వుండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఈ సినిమాలో నాయిక పాత్రలకు కూడా ప్రాధానత్యవుండనున్నదట. అందుకు ప్రియాంక చోప్రా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. అదీకాకుండా హాలీవుడ్ నటిని కూడా తీసుకునే ఆలోచనలో వున్నట్లు కూడా మరో వార్త వినిపిస్తుంది. హాలీవుడ్ సినిమా స్థాయిలో వుండడంతో యాక్షన్ పార్ట్ చేయగలిగే నటికి ప్రాధాన్యత వుండనున్నదట. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
