Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?
అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 తర్వాత తర్వాత మార్కెట్ హై లెవెల్ లో ఉంది. ఆ సినిమా ఇచ్చిన బలంతో ఇండియా లోనే మరింత ఫేమస్ అయ్యాడు.ప్రముఖ సంస్థ ఓ యాడ్ చేయడానిని వంద కోట్లు ఇచ్చిందని తెలుస్తోంది. ఇక పుష్ప 2 కోసం అల్లు అర్జున్ మొత్తం మార్కెట్ ఆదాయంలో 27%, 250 కోట్లకు పైగా అందుకుంటున్నట్లు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. దానితో ఆ తర్వాత ఎటువంటి సినిమా చేయాలనేది ఆలోచనలో ఉన్నట్లు తెలుశ్తోంది.
మార్చి లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ను ప్రారంభించనున్నారు. పౌరాణిక నేపథ్యం కథ కనుక అల్లు అర్జున్ ఇందులో సరికోత్హగా కనిపించనున్నారు అయితే స్క్రిప్ట్ ప్రోగ్రెస్‌లో ఉంది ఫైనల్ అవుట్ పుట్ రాలేదని తెలుస్తోంది. అందుకే ముందుగా పూజ తో ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఒక ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తుండగా, బన్నీ ముందుగానే మరో చిత్రాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆర్థికపరమైన కారణాల వల్ల జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అట్లీ సినిమా బడ్జెట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్‌గా అట్లీ పారితోషికం దాదాపు 100 కోట్లు. అల్లు అర్జున్ 250 కోట్లు మొత్తం 350 కోట్లుకాగా, సినిమా ఏ స్థాయిలో తీయాలనే ప్లాన్ చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ , త్రివిక్రమ్ భాగాస్వామ్యమ్ లో సినిమా ఉండబోతున్నదని తెలుస్తోంది. అల్లాగే, .అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు రెండూ ఒకేసారి షూటింగ్ జరగ వచ్చని కథనాలు వినిపిస్తున్నాయి.