గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (19:28 IST)

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

Pushpa 2 record
Pushpa 2 record
పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ భారీ హిట్ కొట్టాడు. వరల్డ్ గా 1871 కోట్ల గ్రాస్ గా నేడు ప్రకటించారు. దానికి సీక్వెల్ తీయాలని సుకుమార్ కూడా ఇతెవలె ప్రకటించాడు. కాని కథ ఇంకా పుర్తిగాలేదు. ఈలోగా మరో సినిమా చేసే పనిలో అల్లు అర్జున్ ఉన్నాడు. అందుకే  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసారు. లెక్క ప్రకారం మార్చి 28 న గ్రాండ్ గా ముహూర్తం పెట్టారు. అయితే కథ మైథలాజికల్ టచ్ ఉన్న భారీ సినిమా. కాని ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉండటంతో రెగ్యులర్ షూట్ ఏప్రిల్ లో జరగనుందని తెలుస్తోంది. అల వైకుంటపురంలో జోడి పూజ హెడ్జె నటించనుంది. 
 
ఇదెలా ఉండగా, అల్లు అర్జున్. ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. వాటి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడి కానున్నాయి. సమాచారం ప్రకారం, జాన్వీ కపూర్ హీరోయిన్ గా అల్లు అర్జున్ సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటించింది. ఆ సమయంలోనే రామ్ చరణ్ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అందుకే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ తో తెరకెక్కుతున్న RC16 సినిమాలో ఆమె నటిస్తుంది.