సోమవారం, 14 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 ఏప్రియల్ 2025 (09:59 IST)

విశృంఖల ప్రేమకు చిరునామాగా మెట్రో రైళ్లు! బెంగుళూరు మెట్రోలో యువకుడి విపరీత చర్య! (Video)

bangalore young couple romance
దేశంలోని పలు ముఖ్య నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రైళ్లను కొందరు ప్రేమికులు, యువతీయువకులు తమ ప్రేమ కలాపాలకు చిరునామాగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా, తమ విశృంఖల చర్యలతో ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్నారు. తాజాగా బెంగుళూరు మెట్రో రైళ్లలో ఢిల్లీ మెట్రో కల్చర్ పాకింది. ప్రేమికులిద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బెంగుళూరు నగరంలోని మెజిస్టిక్ ప్రాంత మాడప్రభు కెంపేగౌడ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో ఓ ప్రేమజంట సృష్టించిన కలకలం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఆ ప్రేమికులిద్దరి వ్యవహారం విచ్చలవిడిగా ప్రచారానికి నోచుకుంది. ఆ గొడవ పెద్దదై బీఎంఆర్సీఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రేమికుల అసభ్యప్రవర్తన చూసి ప్రజలు, ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
మెట్రో స్టేషన్‌లోని మాదావర వైపు వెళ్లడానికి మూడో నంబర్ ఫ్లాట్‌ఫాంపై గురువారం సాయంత్రం ఓ ప్రేమ జంట వచ్చింది. పరస్పర చుంభనాలతో కలకలం రేపింది. వారి ప్రవర్తనను కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. టిక్కెట్ కౌంటర్ వద్ద ఆ యువకుడు మరింతగా రెచ్చిపోయాడు. అతని విపరీత స్పందనలు మరింతగా భయపెట్టేలా ఉన్నాయి.
 
మరీ ఇంత బహిరంగ వ్యవహారమా అంటూ ప్రయాణికులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. యువతులు, చిన్నారులంతా చూస్తుండగానే అసభ్యంగా ప్రవర్తించడం తగదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు బీఎంఆర్‌సీఎల్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.