బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 10 అక్టోబరు 2023 (22:16 IST)

పూర్తి శ్రేణి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లను విడుదల చేసిన TCL

image
టెలివిజన్, గృహోపకరణాల పరిశ్రమలో మహోన్నత వారసత్వం కలిగిన అంతర్జాతీయ అగ్రగామి సంస్థ TCL, 10 అక్టోబర్ 2023న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తమ పూర్తి ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కొత్త ఉత్పత్తి లైన్‌ను విడుదల చేసింది. విస్తృత శ్రేణి వాషింగ్ మెషీన్‌లతో పెద్ద ఉపకరణాల కేటగిరీలో అగ్రగామి సంస్థలలో ఒకటిగా వెలుగొందుతున్న TCL, భారతీయ మార్కెట్‌లో కొత్త శ్రేణి ఫ్రంట్ లోడ్ & టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లను సగర్వంగా పరిచయం చేసింది.
 
ఈ వాషింగ్ మెషీన్స్ విడుదల పట్ల తన ఆనందం వ్యక్తం చేసిన TCL సీఈఓ ఫిలిప్ జియా మాట్లాడుతూ, “కస్టమర్ సెంట్రిసిటీ అనేది మా వ్యాపార వ్యూహంలో ప్రధానమైనది. భారతదేశంలోని హైదరాబాద్‌లో పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కోసం అత్యాధునిక తయారీ యూనిట్‌ను కలిగి ఉన్నందున, మా విలువైన కస్టమర్‌ల కోసం అత్యంత సరసమైన ధరలకు ప్రత్యేకమైన ఫీచర్‌లతో కూడిన కొత్త శ్రేణి వాషింగ్ మెషీన్‌లను తీసుకు రావడం పట్ల మేము సంతోషిస్తున్నాము, ఇది వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి మాకు తగిన అవకాశం అందిస్తుంది" అని అన్నారు.
 
పెరుగుతున్న పట్టణీకరణ, అధిక డిస్పోసల్ ఆదాయాలు, కొనుగోలు సౌలభ్యం వంటివి పూర్తి ఆటోమేటిక్ వాషింగ్‌మెషీన్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతీయ కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడానికి TCL ఇప్పుడు విస్తృత శ్రేణి ఫీచర్‌లు కలిగిన, సరికొత్త శ్రేణి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్‌మెషీన్‌లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది.
 
కొత్త ఉపకరణాల కేటగిరీని ప్రారంభించడంలో భాగంగా, TCL పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల శ్రేణిని పరిచయం చేస్తోంది. ఫ్రంట్ లోడింగ్ F12 సిరీస్ వాషర్ & డ్రైయర్ కాంబో, P6 సిరీస్ ఫ్రంట్ లోడింగ్ వాషర్‌లు వరుసగా BLDC మోటార్, స్మార్ట్ DD మోటార్‌తో మిళితమై ఉంటాయి. F- సిరీస్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు భారతీయ కస్టమర్ల అవసరాలు మరియు ఆకాంక్షలను తీర్చడానికి అధునాతన ఫీచర్లతో రూపుదిద్దుకున్నాయి. దీనితో పాటుగా, TCL ఇప్పుడు 7 కిలోల నుండి 9.5 కిలోల కెపాసిటీ మరియు అధునాతన ఇంటిగ్రేటెడ్ ఫీచర్‌లతో కూడిన విస్తారమైన ట్విన్ టబ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లను కూడా పరిచయం చేస్తుంది.