శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

దేశంలో భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే...

gold
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇజ్రాయెల్ - పాలస్తీనా దేశాల మధ్య భీకరంగా పోరు సాగుతుంది. ఈ యుద్ధం ప్రభావం కారణంగా బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,350గా ఉంది. 
 
సోమవారం ప్రారంభం ట్రేడింగ్‌లోనే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.440 పెరిగింది. అలాగే, మంగళవారం కూడా బులియన్ మార్కెట్‌లో వీటి ధరలు పెరిగిపోయాయి. సోమవారం నాటి మార్కెట్‌తో పోల్చితే మంగళవారం మరో రూ.220 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200గాను, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350గా ఉంది. అలాగే, వెండి ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కిలో వెండి ధర రూ.72,600గా ఉంటే, సోమవారంతో పోల్చితే మంగళవారం ధర రూ.500 పెరిగింది. 
 
ఇతర నగరాల్లో బంగారం ధరలు... 
విజయవాడ: 24 క్యారెట్లు - రూ. 58,200.. 22 క్యారెట్లు - 53,350
విశాఖపట్నం: 24 క్యారెట్లు - 58,200.. 22 క్యారెట్లు - రూ. 53,350
బెంగళూరు: 24 క్యారెట్లు - 58,200.. 22 క్యారెట్లు - రూ. 53,350
చెన్నై: 24 క్యారెట్లు - 58,530.. 22 క్యారెట్లు - రూ. 53,650
ఢిల్లీ: 24 క్యారెట్లు - 58,350.. 22 క్యారెట్లు - రూ. 53,500.