గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (12:27 IST)

భారీగా పెరిగిన బంగారం ధరలు..

gold
బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వార్త బంగారం కొనుగోలు దారులకు చేదు వార్తేనని చెప్పాలి. పది గ్రాముల బంగారం ధరలపై నాలుగు వందల రూపాయల వరకూ పెరిగింది. వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు. 
 
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 53,150 రూపాయలకు చేరుకుంది. 
 
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,540 రూపాయలుగా నమోదయింది. వెండి ధర మాత్రం 75,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.