శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-10-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం...

Karkatam
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద ఐ|| నవమి ఉ.11.24 పుష్యమి తె.4.37 ఉ.వ.11.12 ల 12.56. సా.దు.4.12 ల 5.00.
సూర్య స్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ప్రముఖులతో కలిసి విందులు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. వాహనం నడుపునపుడు మెళకువ వహించండి. కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
 
వృషభం :- మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. కొబ్బరి, పండ్లు, చల్లని, పానీయ వ్యాపారస్తులకు లాభదాయకం. ముఖ్యుల విషయాలు చర్చకు వచ్చిన వాయిదా వేయండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కుంటారు. 
 
మిథునం :- ఇతరుల సలహాను పాటించుటవలన సమస్యలు తప్పవు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. సోదరీ, సోదరులతో ఏకీభవం కుదరగలదు.
 
కర్కాటకం :- స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుది. ఆలయాలను సందర్శిస్తారు. పండ్ల, పూల, కొబ్బరి చల్లని పానీయ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.
 
సింహం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. పెద్దలతో ఏకీభవించలేరు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారా రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. క్రీడల పట్ల, వస్తువుల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య :- అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. తరుచూసభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రుణం తెచ్చే ప్రయత్నంలో సఫలీకృతులౌతారు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు.
 
తుల :- మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసివస్తుంది. విదేశాలు వేళ్ళాలి అనే అలోచనను క్రియారూపంలో పెట్టండి. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ప్రముఖుల కలయికతో మీ పనులు సానుకూలమవుతాయి.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అయిన వారి సలహా తీసుకోవటం మంచిది. చెల్లింపులు, కరెన్సీ నోట్లు తీసుకొనే విషయంలో మెళకువ వహించండి. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
ధనస్సు :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులు ఒత్తిడి అధికం. మీ వాహనం పార్కింగ్ చేసే విషయంలో ఇబ్బందులెదుర్కుంటారు. సంగీత, నృత్య కళాకారులకు ప్రోత్సాహకరం. మీ సంతానం విద్యా, ప్రయాణంపై శ్రద్ధ వహిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
మకరం :- రవాణా రంగంలోవారికి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
కుంభం :- విదేశాయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. వాహనయోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకుతగిన ప్రోత్సాహం లభిస్తాయి.
 
మీనం :- మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. దైవ కార్యాలు, దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యులకు బహుమతులు అందచేస్తారు. బంధువులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు.