సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-10-2023 శుక్రవారం రాశిఫలాలు - గౌరిదేవిని ఆరాధించినా సర్వదా శుభం...

Rishabham
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద ఐ|| సప్తమి ఉ.9.10 ఆరుద్ర రా.12.45 ఉ. వ.8.19 ల 10.00.
ఉ.దు. 8.16 ల 9.03 వ. దు. 12.12 ల 1.00.
 
గౌరిదేవిని ఆరాధించినా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీతో సఖ్యతగా నటించి తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. విద్యార్థులకు విద్యా విషయాలలో ఏకాగ్రత ముఖ్యం.
 
వృషభం :- మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాభంగం. బంధువులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులు అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
మిథునం :- దైవకార్యాలు, దీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సంగీత, నృత్య కళాకారులకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాల్లో పోటీ, షాపు పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మిత్రులు పరస్పరం కానుకలిచ్చి పుచ్చుకుంటారు.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి వ్యాపారాల్లో భేషజం, మొహమ్మాటాలు కూడదు. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
సింహం :- మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపార వర్గాల వారికిచెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం.
 
కన్య :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పెట్టిపోతల విషయంలో పెద్దల సలహా పాటించటం శ్రేయస్కరం. నేడు చేజారిన అవకాశం తిరిగి రావటం కష్టమని గ్రహించండి. విద్యార్థులు ప్రతిభా పోటీల్లోరాణిస్తారు. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
తుల :- ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశ నెరవేరదు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. రాజకీయాలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. సోదరీ సోదరుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికంగా ఉంటాయి.
 
వృశ్చికం :- దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత పొందుతారు. పెద్దల జోక్యంతో ఆస్తి, కుటుంబ వివాదాలు సద్దుమణుగుతాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. చిన్న తప్పిదాలే పెద్దసమస్యగా మారే అవకాశం ఉంది. కుటుంబీకుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఎంతటి కష్టాన్నైనా నిబ్బరంగా భరిస్తారు.
 
ధనస్సు :- వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. రాజకీయనాయకులు ప్రముఖులతో కలిసి విందులలో పాల్గొంటారు. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. మీ వాహనం, విలువైన వస్తువులు ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి.
 
మకరం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అయిన వారి కోసం బాగా శ్రమిస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది.
 
కుంభం :- బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. స్త్రీలకు తల, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ద్విచక్ర వాహనం పై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాలలో హామీలు, మధ్యవర్తిత్వం వహించడం వలన మాట పడవలసివస్తుంది. బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. పెద్దమొత్తం నగదు తీసుకునే విషయంలో జాగ్రత్త చాలా అవసరం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, లభిస్తుంది.