1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-10-2023 బుధవారం రాశిఫలాలు - గణపతిని పూజించినా మీ సంకల్పం...

astro12
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద బ|| పంచమి ఉ.8.56 రోహిణి రా.10.41 ప.వ.2.35 ల 4.12
తె.వ.4.28 ల ప.దు. 11.26 ల 12.13.
గణపతిని పూజించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. జాగ్రత్త వహించండి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
వృషభం :- తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. గృహాలంకరణ అంశాలపై దృష్టి పెడతారు. దీర్ఘకాలం వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు పంచుకోనే వారి కోసం మనసు తహతహలాడుతుంది.
 
మిథునం :- ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తప్పదు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. వారసత్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది.
 
కర్కాటకం :- పెద్దలకు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. రావలసిన ధనం వాయిదా పడుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తికానవస్తుంది. ప్రయాణాల విషయంలో ముందు చూపు ఎంతో అవసరం. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు.
 
సింహం :- గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. స్త్రీలు ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. మీసంతానం మొండి వైఖరి వల్లచికాకులు తప్పవు. వివాహ యత్నాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.
 
కన్య :- హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. అందరితో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. తరుచు సేవ, దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
తుల :- స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పురోభివృద్ధి కానవస్తుంది.
 
వృశ్చికం :- బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెళకువ వహించండి. మిత్రులు మీ యత్నాలకు సహకరిస్తారు. ఎంతో శ్రమించిన మీదటగాని అనుకున్న పనులు పూర్తి కావు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. నూతన పరిశ్రమలు, వ్యాపార విస్తరణలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- కొంత మంది మీ నుంచి కీలకమైన విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్తపథకాలు రూపొందిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
మకరం :- రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అసవరం. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. దీక్షలు, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
కుంభం :- కోర్టు వ్యవహరాలు, ఆస్తి తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులెదురవుతాయి. సోదరుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు.