శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-10-2023 ఆదివారం రాశిఫలాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా శుభం...

astro8
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద బ|| విదియ ప.12.12 అశ్వని రా.11.09 రా.వ.7.18 ల 8.51. సా.దు. 4.12 ల 5.00. 
మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- వృత్తి, వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. చిన్ననాటి వ్యక్తుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీల ప్రతిభా పాటవాలకు ప్రోత్సా హంలభిస్తుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
వృషభం :- ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
మిథునం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. 
 
కర్కాటకం :- స్థిరాస్తుల కొనుగోళ్ళపై దృష్టి సారిస్తారు. స్త్రీలకు నరాలు, దంతాలు, రుతు సంబంధిత చికాకులు అధికం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
సింహం :- విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాలలో వారికి అనుకూలమైనకాలం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. తొందరపాటు నిర్ణయం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారంవుంది.
 
కన్య :- హోటల్ వారికి పనిభారం అధికమవుతుంది. అలవాటు లేని పనులు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాబోయే అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు.
 
తుల :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధు మిత్రులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
వృశ్చికం :- విందులలో పరిమితి పాటించడం చాలా అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు.
 
ధనస్సు :- శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పరస్త్రీలతో అధికంగా సంభాషించడంమంచిదికాదు. ముందుచూపుతో వ్యవహరించుటమంచిది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం :- వాతావరణంలోని మార్పు వ్యవసాయదారులకు ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు కాళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులుపూర్తిచేస్తారు.
 
కుంభం :- రేపటి కార్యక్రమాల గురించి ఈ రోజే ఆలోచించి క్రియారూపంలో పెట్టండి. ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారభమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తువేయడం వల్లగుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. విద్యార్ధులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు విరమించుకుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం.