గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-09-2023 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను దర్శించి ఆరాధించిన శుభం...

astro5
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ చతుర్ధశి సా.6.26 పూర్వాభాద్ర రా.2.48 ఉ.వ.10.23 ల 11.53 ఉ. దు. 9.55ల 10.44 ప. దు. 2.50ల 3.39.
 
సాయిబాబాను దర్శించి ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ఉద్యోగస్తులు అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్ఎస్టేట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
వృషభం :- ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. స్త్రీల ఆడంబరాలను చూసి ఎదుటివారు అపోహపడతారు.
 
మిథునం :- సినిమా, కళా రంగాల్లో వారికి మార్పులు అనుకూలం. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. రియల్ ఎస్టేట్ రంగాలవారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది.
 
కర్కాటకం :- మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
సింహం :- ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బంది సహాయ సహకారాలు లభిస్తాయి. డాక్టర్లకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కన్య :- దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. నగదు చెల్లింపు చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త వహించండి. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
తుల :- పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యుని సలహా తప్పదు. దంపతుల మధ్య మనస్పర్ధలు, కలహాలు తలెత్తగలవు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంపొందటంతో పాటు తోటి విద్యార్థులతో పోటీ పడతారు. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి.
 
వృశ్చికం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్వతంత్ర వృత్తులలో వారికి జయం చేకూరును. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్ధంగా నిర్వహిస్తారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది.
 
ధనస్సు :- వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మకరం :- ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహరాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. విద్యార్ధులకు విద్యావిషయాలలో ఏకాగ్రత ముఖ్యం. ఖర్చులుమీ రాబడికి మించటం వల్లస్వల్ప ఒడిదుడుకులు తప్పవు.
 
కుంభం :- సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం :- శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఐరన్, కలప, సిమెంట్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలదు. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావచ్చు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది.