1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 24-09-2023 Daily Horoscope

24-09-2023 ఆదివారం రాశిఫలాలు - హనుమాన్ చాలీసా చదివినా...

astro1
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ దశమి తె.3.50 పూర్వాషాఢ ఉ.10.37 సా.వ. 6.10 ల 7.41 సా.దు. 4.32ల 5.21.
 
హనుమాన్ చాలీసా చదివినా లేక విన్నా శుభం
 
మేషం :- కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో అసహనానికి లోనవుతారు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
 
వృషభం :- కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులుమీ పై మంచి ప్రభావం చూపుతాయి.
 
మిథునం :- ముఖ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. ప్రతి విషయంలోను ఓర్పు, విజ్ఞతగా వ్యవహరించాలి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ధనం బాగా సంపాదించి దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు.
 
కర్కాటకం :- పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. చిరకాలంగా వేధిస్తున సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు అల్లర్లు, సామాజిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. మీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించాలి. పెద్దల ఆరోగ్యం కలవరపరుస్తుంది.
 
సింహం :- విద్యార్ధులకు కొత్త పరిచయాలు వ్యాపకాలు ఉత్సాహం కలిగిస్తాయి. ట్రాన్సుపోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమోబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
కన్య :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రవాణా రంగంలోవారికి సంతృప్తి కానరాగలదు. స్త్రీలకు సంపాదన పట్లఆసక్తి పెరుగుతుంది. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 
తుల :- రాజకీయ కళా రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలం. మిత్రులు చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. నిరుద్యోగులనకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది.
 
వృశ్చికం :- బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు తోటివారి నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై న్యాయసలహా పొందవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని మార్పులు సంభ విస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు నూతన పనులు చేపట్టే విషయంలో పునరాలోచన అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. వీసా, పాస్‍‌పోర్టు వ్యవహారాలు సానుకూల మవుతాయి. పెద్దలతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. మీ కళత్ర వైఖరి మీకు కెంతో చికాకు కలిగిస్తుంది.
 
మకరం :- వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలుపలు విధాలుగా ఉంటాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైరకార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. సినిమా, కళా, రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. ఇతర కుటుంబ విషయాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన ధనం సకాలంలో అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీవుండదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
మీనం :- చిన్నతరహా పరిశ్రమల వారికి పురో భివృద్ధి. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలు పలు విధాలుగా ఉంటాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. 
About Writer
రామన్
తర్వాతి కథనం
25-09-2023 సోమవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది...