శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-09-2023 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం..

Sagitarus
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ పంచమి ఉ.10.39 విశాఖ ప.12.43 సా.వ.4.43 ల 6.20. ప.దు. 11.33 ల 12.23.
 
సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. మిత్రులకిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
వృషభం :- పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించటంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. విద్యార్థులకు ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి.
 
మిథునం :- మీ సమర్థతను అధికారులు గుర్తిస్తారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకు లెదురవుతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు.
 
కర్కాటకం :- ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విదేశాలలోని మీ బంధు మిత్ర వర్గ సహాయ సహకారాలను అందుకుంటారు. ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తారు.
 
సింహం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబీకులతో ఏకీభవించలేక పోతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. మీ సంతాన కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
కన్య :- ఆకస్మిక ఖర్చులు, పెరిగిన కుటుంబ అవసరాలు ఆందోళన కలిగిస్తాయి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. దైవసేవా కార్యాక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
తుల :- కొత్త కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగుల ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలం. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
వృశ్చికం :- ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తి కావు. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేక పోతారు. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచన లుంటాయి. దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ మనస్సుకు నచ్చని సంఘటనలు జరుగుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తుల మీద మక్కువ పెరుగుతుంది. ఇతరులను అతిగా విశ్వసించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. మీ యత్నాలకు బంధువులు సహకరిస్తారు.
 
మకరం :- వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి.
 
కుంభం :- స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలుకాగలవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలో నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు.
 
మీనం :- స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకు లెదురవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.