బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-09-2023 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్యుని మంకెనపూలతో ఆరాధించిన శుభం...

Pisces
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ విదియ ఉ.9.17 హస్త ఉ.9.31 సా.వ.6.02 ల 7.44.
సా.దు. 4.32 ల 5.21.
 
ఆదిత్యుని మంకెన పూలతో ఆరాధించిన శుభం కలుగుతుతుంది.
 
మేషం :- రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. ముఖ్యులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
వృషభం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో నూతన పరిచయాలేర్పడతాయి. వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహారించండి. వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. హామీలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండటంమంచిది.
 
మిథునం :- మీ సమస్య ఒకటి సానుకూలం కావటంతో మానసికంగా కుదుటపడతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. నూతన వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. స్త్రీలు కళాత్మక, క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. సహోద్యోగులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. మీరు చేసే యత్నాలకు సన్నిహితుల నుండి సహకారం లభిస్తుంది.
 
సింహం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. దంపతుల మధ్య అవగాహనాలోపం. చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. రాజకీయనాయకులు సేవా కార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధ కూడదు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కన్య :- పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచన లుంటాయి. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి.
 
తుల :- నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలనిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంలో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది.
 
ధనస్సు :- ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. క్లిష్టతరమైన పనుల్ని ఎలా అధిగమించాలో తెలియనప్పుడు తగిన సూచనలు పాటించండి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. రుణ యత్నాల్లో అలసత్వం వంటి చికాకులను ఎదుర్కుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. మీరు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మీ వ్యవహరాలను స్వయంగా సమీక్షించుకోవటం ఉత్తమం. ప్రముఖుల కలయిక కోసం పలుమార్లు తిరగవలసి వస్తుంది.
 
కుంభం :- కొన్ని విషయాల్లో కుటుంబంలోమీ ఆధిపత్యం చెల్లదు. యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు.
 
మీనం :- పద్ధతిలోనే గుణపాఠం నేర్పవచ్చు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.