సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (22:32 IST)

17-09-2023 నుంచి 23-09-2023 వరకు మీ వార రాశిఫలాలు

Weekly astrology
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆర్థికలావాదేవీల్లో జాగ్రత్త. రావలసిన ధనాన్ని చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలకు పోవద్దు. ఉపాధ్యాయులకు కష్టసమయం. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు బాగుంటుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు నిరాశాజనకం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వాగ్వాదాలకు దిగవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పెట్టుబడులు కలిసిరావు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వివాహవేదికలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. వివాదాలు సద్దుమణుగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పెట్టుబడులు కలిసిరావు. సోమవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, అశ్లేష 1, 2, 3, 4 పాదములు
అన్ని విధాలా అనుకూలమే. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు బాగుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్ధంలో మెళకువ వహించండి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు సమస్యలెదురవుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆదివారంనాడు దుబారా ఖర్చులు విపరీతం. పనులు అర్థాంతంగా ముగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. భేషజాలకు పోవద్దు. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వాస్తుదోష నివారణ అనివార్యం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. సోమవారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. సౌమ్యంగా మెలగండి. పంతాలకు పోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. మంగళ, బుధవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక సాధ్యపడదు. గురువారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. అవివాహితులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు ఒత్తిడి, పనిభారం. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
గ్రహాల సంచారం కొంత మేరకు అనుకూలంగా ఉంది. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదివారం నాడు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంతమొత్తం ధనం అందుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆచితూచి అడుగేయాలి. ఒంటెద్దు పోకడ తగదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రావలసిన ధనం అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మానసికంగా కుదుటపడతారు. మంగళ, బుధవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రయాణం అనుకూలించదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురువారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలించదు. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. అవివాహితులకు శుభయోగం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం.