బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (15:33 IST)

22-01-2023 నుంచి 28-01-2023 వరకు మీ వార ఫలితాలు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను నమ్మవద్దు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మేలు చేయబోతే చెడు ఎదురయ్యే ఆస్కారం ఉంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మితంగా సంభాషించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. అధికారులుకు కొత్త బాధ్యతలు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయాలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాభివృద్ధికి విపరీతంగా శ్రమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఈ వారం సాదాసీదాగా గడిచిపోతుంది. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆర్థిక ఇబ్బందులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలడదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. బిల్డర్లకు కష్టసమయం. ప్రయాణం విరమించుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను ఆశ్రయించవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్తులతో సంభాషిస్తారు. సోమ, మంగళవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. హామీలు నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆది, బుధ వారాల్లో పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందిపడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
హామీలు నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొండుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గృహమార్పు కలిసివస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆధ్యాత్మికతత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త. సాధ్యం కాని హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సన్నిహితుల సలహా పాటించండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. రిప్రజెంటేటివ్ లకు ఒత్తిడి అధికం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆలోచననల్లో మార్పు వస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉత్సవాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. యత్నాలు విరమించుకోవద్దు. మీ సమర్థత ఎదుటివారికి కలిసివస్తుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శుక్ర, శనివారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. చీటికిమాటికి చిరాకుపడుతుంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూర ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
శుభవార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. పరిచయాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆప్తులకు కీలక సమాచారం అందిస్తారు. ఖర్చులు అధికం. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ప్రణాళికలు వేసుకుంటారు. మీ అంచనాలు ఫలించవు. దుబారా ఖర్చులు విపరీతం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. సోమ, మంగళవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కామవుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు.