1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (20:17 IST)

15-01-2023 నుంచి 21-01-2023 వరకు మీ వార రాశి ఫలితాలు

Weekly astrology
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
శుభవార్తలు వింటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు కిందిస్థాయి తప్పిదాల వల్ల ఇబ్బందులు తప్పవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సాంకేతిక రంగాల వారికి నిరాశాజనకం. పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఈ వారం అనుకూలదాయకం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. పాత మిత్రులతో సంభాషిస్తారు. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. మనోధైర్యంతో మెలగండి. మీ సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. వాస్తుదోష నివారణణ చర్యలు సత్ఫలితమిస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్సిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో అవస్థలెదురవుతాయి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
పట్టుదలతో శ్రమిస్తేనే లక్ష్యం సిద్ధిస్తుంది. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వేడుకను ఆర్ణాటంగా చేస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్సిస్తుంది. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురువుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను నమ్మవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు పరిశీలించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
అన్ని విధాలా అనుకూలదాయకం. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. మీ జోక్యం అనివార్యం. మంగళ, బుధ వారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆచితూచి అడుగేయాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అనుకున్నది సాధిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. గురువారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విదేశాల నుంచి సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. అవివాహితుకు శుభయోగం. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం బాగుంటుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. వేడకకు హాజరవుతారు. బంధువుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. సోమ, మంగళ వారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల వ్యాఖ్యలు మంచి ప్రభావం చూపుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టేటివ్ లు, దళారులను నమ్మవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూలతలున్నాయి. మీ కష్టం వృధా కాదు. కొంతమొత్తం ధనం అందుతుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. సోదరీ సోదరుల ఆలోచనల్లో మార్పు వస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వాయిదా పడుతున్నన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. బుధ, గురు వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ శ్రీమతి సలహా పాటించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. దైవదర్శనాలు మానసికోల్లాసం కలిగిస్తాయి. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కార్యం సిద్ధిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. బంధువులతో సత్సబంధాలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. శుక్ర, శని వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య పలు విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. వ్యాపారాలు సామన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆశావహదృక్పధంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు చైతన్యం కలిగిస్తాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఓర్పు, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రణాళికలు సత్ఫలితాలిస్యాఇ. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. సోదరీ సోదరులతో అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు యూనియన్ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పొగిడే వారితో జాగ్రత్త. ఏ విషయానికీ ప్రాధాన్యమివ్వవద్దు. సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. కనిపించుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పాత పరిచయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహ్నస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. భూసంబంధిత వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రయాణం సజావుగా సాగుతుంది.