శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-01-2023 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం...

Aquarius
మేషం :- కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- స్త్రీల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వస్తువుల కొనుగోళ్ళ విషయంలో ఏకాగ్రత వహించండి. దేవాలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. నిరుద్యోగులకు సత్కాలం ఆసన్నమైనది. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి ఉండదు. 
 
మిథునం :- ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నం వాయిదా వేయడంమంచిది. కళల పట్ల ఆశక్తి పెరుగుతుంది. మిత్రుల ద్వారా అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఆసక్తి కలిగిస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంబంధ బాంధవ్యాలు నెలకొని ఉంటాయి. భాగస్వామికుల మధ్య నూతన విషయాలు చర్చకువస్తాయి. 
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. వైజ్ఞానిక శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మంచివారితో పరిచయం మీ అభివృద్ధికి దోహదపడుతుంది. నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం :- స్త్రీలు గృహోపకరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగ, విదేశీ యత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
కన్య :- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. రుణ యత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది.
 
తుల :- ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ముక్కుసూటిగా పోయే మీ స్వభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతిపథంలో కొనసాగుతాయి. ధనం చేతిలో నిలబడటం కష్టమే. ప్రేమికులు అతిగా వ్యవహరించట వల్ల చికాకులు తప్పవు.
 
వృశ్చికం :- వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. మిత్రుల కలయికతో ప్రశాంత కలుగుతుంది. రావలసిన ధనం చేతికందటతో ఆర్థికంగా కుదుటపడతారు. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత అవసరం. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన మేలు పొందుతారు. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందనలభిస్తుంది.
 
ధనస్సు :- ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించటం వల్ల ఇబ్బందులెదుర్కో వలసివస్తుంది. బంధువుల రాక గృహంలో కొంత అసౌకర్యం కలిగిస్తుంది. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలలో భక్తిపరమైన ఆలోచనలు అధికమవుతాయి. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు.
 
మకరం :- దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. ప్రయాణం వల్ల స్త్రీలు స్వల్ప అస్వస్తతకు లోనవుతారు. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
కుంభం :- విద్యార్థుల ఆలోచలు పక్కదారి పట్టేఆస్కారం ఉంది. బంధు మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ధనం విపరీతంగా వ్యయం చేస్తారు.
 
మీనం :- ఆలయ సందర్శనాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అసవరం. మీ ప్రత్యర్థులకు వారి పద్ధతిలోనే గుణపాఠం నేర్పవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు.