ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-01-2023 గురువారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి...

Aquarius
మేషం :- మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది.
 
వృషభం :- భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మీ తొందరపాటు తనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. వృద్ధాప్యంలో ఉన్న వారికి శారీరిక బాధలు సంభవిస్తాయి.
 
మిథునం :- పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీల తెలివి తేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.
 
కర్కాటకం :- మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత చాలా అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచిఉండాల్సి వస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు.
 
సింహం :- దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పొదుపు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
 
కన్య :- వాహనం,విలువైన సామగ్రి మరమ్మతులకు గురయ్యే ఆస్కారం ఉంది. దైవ, సేవా కార్యక్రమాలలో అతి ఉత్సాహంగా పాల్గొంటారు. సాహస ప్రయత్నాలు విరమించండి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికమవుతాయి.
 
తుల :- మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వ విషయంలో పునరాలోచన మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
వృశ్చికం :- పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. రుణ విముక్తులు కావాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి.
 
ధనస్సు :- దుబారా ఖర్చులు అధికం. ప్రైవేటు సంస్థలలోని వారు మరో ఉద్యోగంలో చేరే విషయంలో పునరాలోచన మంచిది. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
మకరం :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఏ పని సక్రమంగా సాగక నిరుత్సాహం చెందుతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి పెరుగుతుంది.
 
కుంభం :- బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. అనవసరపు వాగ్ధానాలు సమస్యలను తెచ్చుకోకండి. కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది.
 
మీనం :- వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పందాలు జూదాల వల్ల నష్టపోయ్యే అవకాసం ఉంది. ఖర్చులు పెరగటంతో కుటుంబంలోని రహస్య విరోధులు అధికమవుతారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయ్యలేక పోతారు. వినోదాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.