మధ్యాహ్నం భోజనం కలుషితం... ఆరగించిన 44 మంది విద్యార్థుల అస్వస్థత
తెలంగాణా రాష్ట్రంలోని మాదాపూర్ చందానాయక్ తండ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితమైంది. ఇది తెలియకుండా ఆరగించిన విద్యార్థుల్లో 44 మంది అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీనికి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అలాగే, హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన ఏడుగురు విద్యార్థులు నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి భోజనం చేసిన విద్యార్థులు వాంతులు, విరోచనలు, కడుపునొప్పితో బాధపడుతున్నారని, వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించామని గురుకుల పాఠశాల సిబ్బంది తెలిపారు. పిల్లల ఆరోగ్య ప్రస్తుతం నిలకడగానే ఉందని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తెలిపారు.