1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Stray dog jumped over man shoulder and bites hard with its teeth

వ్యక్తి భుజం పైకి ఎగిరి పళ్లను దించిన వీధికుక్క (video)

Stray dog ​​bites man
GHMC పరిధిలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట వీధికుక్కల కాటుకు గురవుతున్న బాధితులు వుంటూనే వున్నారు. తాజాగా ఓ పాఠశాల గేటు వద్ద సెక్యూరిటీగా వున్న ఓ వ్యక్తిపై వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. అతడి భుజంపైకి ఎగిరి పళ్లతో కొరికింది. పళ్లను అలా శరీరంలోకి దించేసిన కుక్కను విదిలించుకునేందుకు ఆ వ్యక్తి తంటాలు పడ్డాడు. కుక్కకాటుతో అతడి భుజం రక్తం కారింది. అతడి గాయాలను చూసిన మరో వ్యక్తి పెద్ద కర్రను తీసుకుని కుక్కను బాదాడు. దాంతో అది అక్కడి నుంచి పారిపోయింది.
 
మరోవైపు ఎనిమిదేళ్ళ బాలుడుపై 20కిపై గా కుక్కలు దాడి చేశాయి. పుట్టుకతో మూగవాడైన ఆ చిన్నారి సాయం కోసం అరవలేని నిస్సహాయస్థితిలో తీవ్రంగా గాయపడ్డాు. ఈ హృదయ విదాకర ఘటన మంగళవారం చోటుచేసుకుంది. 
 
ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతి రావు, చంద్రకళ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి శివగంగ కాలనీలో నివసిస్తున్నారు. వారి కుమారుడు ప్రేమ్ చంద్ (8)కు పుట్టుకతోనే మాటలు రావు. నిన్న ఉదయం తల్లిదండ్రులు పనుల్లో ఉండగా, ప్రేమ్ చంద్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కుక్కల గుంపు అతడిపై దాడి చేసి కిందపడేసి విచక్షణా రహితంగా పీక్కుతిన్నాయి. 
 
ఈ దాడిలో బాలుడి చెవి పూర్తిగా తెగిపోగా, తల, వీపు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యారు. బాలుడు ధరించిన స్వెట్టర్‌ను పట్టుకుని కుక్కలు ఈడ్చేశాయి. అదేసమయంలో అటుగా వచ్చిన ఓ స్థానికుడు ధైర్యం చేసి కుక్కలను రాళ్ళతో కొట్టడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 
 
తీవ్ర రక్తస్రావంతో పడివున్న బాలుడుని స్థానికులు వెంటనే నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తెగిపోయిన చెవికి వైద్యులు ఆపరేషన్ చేసినట్టు బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. 
తర్వాతి కథనం
నా డబ్బు నాకు ఇచ్చేయండి, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి డిమాండ్ (video)