మంగళవారం, 16 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 డిశెంబరు 2025 (20:44 IST)

నా డబ్బు నాకు ఇచ్చేయండి, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి డిమాండ్ (video)

image
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినవారు టపాసులు కాల్చుతూ చిందులు వేస్తున్నారు. ఐతే ఓడిన అభ్యర్థులు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరైతే తమకు ఓట్లు వేయాలని ఇంటింటికి డబ్బులు పంచామనీ, తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఇంటింటికీ తిరిగి డిమాండ్ చేస్తున్నారు. 
 
మహబూబాబాద్ లోని సోమ్లా తండాలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన భూక్యా కౌసల్య 27 ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీనితో తను డబ్బులు ఇచ్చినా తనకు ఓట్లు వేయలేదంటూ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసారో లేదో ప్రమాణం చేయాలనీ, లేదంటే తన డబ్బు తనకు వాపస్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగుతోంది. ఇలాంటి ఘటనలు పలుచోట్ల జరుగుతున్నాయి.