గురువారం, 11 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2025 (10:30 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్

Tirumala
శ్రీవారి భక్తులకు శుభవార్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను (ఐసీసీసీ) అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
 
ఈ కొత్త వ్యవస్థ ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఏ కంపార్ట్‌మెంట్‌లో భక్తులు ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారనే వివరాలను ఏఐ టెక్నాలజీతో గుర్తిస్తారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. 
 
ఏ కంపార్ట్‌మెంట్‌లో భక్తులు ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారనే వివరాలను ఏఐ టెక్నాలజీతో గుర్తిస్తారు. ఎక్కువసేపు నిరీక్షిస్తున్న వారికి ప్రాధాన్యతనిచ్చి, వారిని త్వరగా దర్శనానికి పంపేలా చర్యలు తీసుకుంటారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ వివరించారు. భక్తులు క్యూలైన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి దర్శనం పూర్తయ్యే వరకు పూర్తి సమాచారం డాష్‌బోర్డులో కనిపిస్తుంది.
 
దర్శనమే కాకుండా, అన్నప్రసాదాల వితరణను కూడా ఈ కేంద్రం సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఎంతమంది భక్తులకు అన్నప్రసాదం అందించారు. భద్రతను పెంచేందుకు 250 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను (ఎఫ్ఆర్సీ) కొనుగోలు చేయనున్నారు.