ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (21:43 IST)

01-01-2023 నుంచి 07-01-2023 వరకు మీ వార రాశి ఫలితాలు

Astrology
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ప్రతికూలతలు తొలగుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సోమ, మంగళ వారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. దైవదర్శనాల్లో అవస్థలెదుర్కుంటారు. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. బుధవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు నిరాశాజనకం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆది, గురు వారాల్లో దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగ యత్నంలో ఓర్పు, పట్టుదల ప్రధానం. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వస్త్ర, పచారీ వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలించవు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. కళాకారులకు ప్రోత్సాహకరం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
అనుకూలతలున్నాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆత్మీయుల కోసం విరివిగా వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. శకునాలను పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, పనియందు ధ్యాస ప్రధానం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా మెలగండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. పనులు సానుకూలమవుతాయి. మంగళవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం దూకుడు అదుపు చేయండి. నిరుద్యోగుల కృసి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను అధిగమిస్తారు. పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రయాణంలో స్వల్ప ఇబ్బందులెదుర్కుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు,, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వాగ్ధాటితో రాణిస్తారు. ఎదుటివారికి మీ సమర్థతపై నమ్మకం కుదురుతుంది. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. శుక్ర, శని వారాల్లో పనులు ఒక పట్టాన పూర్తి కావు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. బంధుమిత్రులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు కానుకలు అందిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం అన్ని విధాలా శుభదాయకం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ధనప్రలోభాలకు లొంగవద్దు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
వేడుకను ఘనంగా చేస్తారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఓర్పు, పట్టుదలతో మెలగండి. ప్రముఖులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆశావహదృక్పథంతో ఉద్యోగ యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
అనుకూలతలు నెలకొంటాయి. సమర్ధతను చాటుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. శని, ఆది వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించి ఇబ్దందులెదుర్కుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పు అనివార్యం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ప్రతి విషయం మీ శ్రీమతికి తెలియజేయండి. సంతానం విషయంలో శుభపరినామాలున్నాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. రిప్రజెంటేటివ్ లు టార్గెట్లను అధిగమిస్తారు. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. కార్మికులకు పనులు లభిస్తాయి. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. క్రీడ, కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు.