TSNPDCL Recruitment..మొత్తం 157 ఖాళీల భర్తీ
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హన్మకొండ కేంద్రంగా పనిచేసే విధంగా ఈ సంస్థ పలు జిల్లాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
మొత్తం 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 23 జనవరిని చివరి తేదీగా నిర్ణయించారు.
అభ్యర్థులు సీఏ, సీఐఎస్‌ఏ/ డీఐఎస్‌ఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు ఈఆర్‌పీ-ఎస్‌ఏపీలో పరిజ్ఞానం ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.