బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (11:35 IST)

ఒక్క పోస్టు కోసం 10 వేల మంది నిరుద్యోగులు పోటీ.. ఎక్కడ?

jab vacancy
ఉన్నది ఒకే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం. ఈ ఉద్యోగం కోసం పోటీపడే నిరుద్యోగుల సంఖ్య 10 వేల పైచిలుకు మంది. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇది దేశంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పుర్‌ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. డిగ్రీ, కంప్యూటర్‌ డిప్లొమా విద్యార్హతలుగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు.
 
దీంతో ఈ పోస్టుకు ఇప్పటివరకూ 22,410 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో ఫీజు చెల్లించిన 10,386 మందికి హాల్‌ టికెట్లు జారీ చేశారు. ఈ నెల 9న నిర్వహించే పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 3 వరకూ గడువు ఉందని, ఆలోపు అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.