బుధవారం, 29 మార్చి 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated: శనివారం, 24 డిశెంబరు 2022 (20:10 IST)

25-12-22 నుంచి 31-12-22 తేదీ వరకు మీ వార రాశిఫలాలు

weekly astro
మేషం : : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఆప్తుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధికాదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. రుణ ఒత్తిళ్లు అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తులు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. పత్రాలు సమయానికి కనిపించవు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల మన్ననలు పొందుతారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
సన్నిహితుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధింగా ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. బుధ, గురువారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. సోదరెల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరచరాస్తి వ్యవహారంలో జాగ్రత్త. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాన్నిస్తాయి. కొత్త ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
మనోధైర్యంతో అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రతికూలతలను మీకు అనుగుణంగా మలుచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. స్టాకిస్టులకు ఆశాజనకం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు నిరాశాజనకం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
అనుకూలతలు అంతంత మాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధుమిత్రులతో స్పర్ధలు తలెత్తుతాయి. సామరస్యంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శుక్ర, శనివారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతకు గురవుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంగళ, బుధవారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా వ్యవహరించండి. అనవసర జోక్యం తగదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మంచి మార్పు వస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. యోగాపై ఆసక్తి పెంపొందుతుంది. మీ అలవాట్లను మానుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆలయాల సందర్శనలు ఉల్లాసపరుస్తాయి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం అనుకూలదాయకం. సంకల్పం నెరవేరుతుంది. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం చదువులపై దృష్టి సారించండి. ఆరోగ్యం మందగిస్తుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్యవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గురువారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు జాగిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలించవు. శుక్ర, శనివారాల్లో పనులు అనుకున్న విధంగా సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. మనోధైర్యంతో అడుగులేస్తారు. సాహసించి తీసుకున్న నిర్ణయం మంచి ఫలితమిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదివారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తారు. హోల్సేల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. మంగళ, బుధ వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితమిస్తాయి. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.