శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (18:33 IST)

27-11-2022 నుంచి 03-12-2022 వరకు మీ వార రాశి ఫలితాలు

Weekly astrology
Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. రుణఒత్తిళ్లు తొలగుతుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో సన్నిహితుల కలయిక ఉత్సాహపరుస్తుంది. కొత్త యత్నాలు సాగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదామార్పు. స్థానచలనం. కీలక పత్రాలు అందుకుంటారు.
 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మంగళ, బుధ వారాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. న్యాయ, సేవా, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు 
వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. 
 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పఆల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
సంప్రదింపులు ఫలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆదివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. వాస్తుదోష నివారణ చర్యలు నిదానంగా ఫలితమిస్తాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఆశావహదృక్పథంతో మెలగండి. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. నూతన వ్యాపారాలు ఆశించినంత సంతృప్తినీయవు. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. బుధ, గురు వారాల్లో సఖ్యత లోపం, అకారణ కలహం. మీ శ్రీమతి ఆంతర్యం గ్రహించి మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్ అలక్ష్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అనుకున్న వ్యక్తుల కలయిక వీలుపడదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆశాజనకం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా మెలగండి. పట్టుదలకు పోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆది, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహమార్పు చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. వాహనచోదకులకు అత్యుత్సాహం తగదు. 
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
సంకల్పం నెరవేరుతుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. జాతక పొంతన ప్రధానం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వేడుకకు హాజరవుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం.