శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-11-2022 శనివారం దినఫలాలు - లలిత సహస్రనామం విన్నా లేక చదివినా...

Astrology
మేషం :- బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. స్త్రీలు వేడుకలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు యూనియన్ వ్యవహరాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. క్యాటరింగ్ పనివారలకు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
వృషభం :- ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది, ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కుంటారు. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది.
 
మిథునం :- కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు అనవసరపు విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
కర్కాటకం :- మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. పెద్దల ఆరోగ్యం సంతృప్తి కానవస్తుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు బలపడతాయి.
 
సింహం :- ప్రతి చిన్న విషయానికి మీలో ఒత్తిడి, ఆందోళనలు చోటుచేసుకుంటాయి. వృత్తిపరంగా తలెత్తిన సమస్యలను ధీటుగా ఎదుర్కుంటారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో చికాకులుతప్పవు. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.
 
కన్య :- సన్నిహితులతో మీ కష్టాలు చెప్పుకోవటం వల్ల మానసికంగా కుదుటపడతారు. ప్రముఖుల కలియిక వల్ల ఆశించిన ఫలితం ఉండదు. వ్యాపారాల్లో అమలు చేసిన పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి.
 
తుల :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వనసమారాధనలు, విందులలో మితం పాటించండి. తలపెట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు. దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు.
 
వృశ్చికం :- ఆపత్సమయంలో ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సొంత నిర్ణయాల వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి వ్యాఖ్యలు మనస్థాపం కలిగిస్తాయి. పెరిగిన ఖర్చులు, చాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
ధనస్సు :- ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు ఆకస్మిక స్థానచలనం తప్పదు. పత్రికా సంస్థలోనివారికి ఆశాజనకమైన మార్పులుంటాయి. వార్తా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ముఖ్యం. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో ఇరుక్కునే ఆస్కారముంది. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు, ఆదాయాభివృద్ధి పొందుతారు.
 
మకరం :- బంధువుల నుంచి అందిన సమాచారం మిమ్ములను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం ఉత్తమం. సంఘంలో పరపతిగల వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి.
 
కుంభం :- పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పత్రికా రంగంలోని వారికి ఏకాగ్రతలోపం, సహోద్యోగుల తీరు నిరుత్సాహం కలిగిస్తాయి. స్త్రీలకు ఆహార, ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం. దైవదీక్షలు, సేవా సంస్థల్లో సభ్యత్వం స్వీకరిస్తారు. నిరుద్యోగులు వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ఉత్తమం.
 
మీనం :- పుణ్యక్షేత్ర సందర్శనలు, దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రియమైన వ్యక్తుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. బంధువులతో వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి.