శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-11-2022 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన..

Weekly Astrology
మేషం :- ఆర్థికంగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. భాగస్వామ్యుల మధ్య అనవసరపు విషయాలు చర్చకు రావటం వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృషభం :- ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. వ్యాపారాలు, ఉపాధిపథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఆస్తి పంపకాల విషయమై సోదరుల పోరు అధికమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మిథునం :- ఆర్థికంగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వాహన చోదకులకు చికాకులు తలెత్తుతాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీ షాపింగ్ కోసం ధనం వెచ్చిస్తారు. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది.
 
కర్కాటకం :- వైద్యుల శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత ఉన్న మున్ముందు సత్ఫలితాలుంటాయి. ధనం బాగా వ్యయం చేసిఅయిన వారిని సంతృప్తి పరుస్తారు. విద్యార్ధుల సహనానికి పరీక్షా సమయం. దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
సింహం :- వస్త్రాలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలకు శ్రమాధిక్యత, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారులనుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కన్య :- ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా క్రమంగా సమసిపోతాయి. స్త్రీల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. విదేశీయానం, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. పత్రికా సంస్థలలోని వారు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా పొరపాట్లు జరుగకమానవు. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు.
 
తుల :- విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. స్త్రీలు దైవ, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. ఎంతటి చిక్కు సమస్యనైనా కుటింబీకుల సహాయంతో తేలికగా పరిష్కరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
వృశ్చికం :- పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో అవగాహన కుదురుతుంది. వృత్తి రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిత్రుల కారణంగా మీ కార్యమ్రాలు మార్చుకోవలసి ఉంటుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు.
 
ధనస్సు :- ప్రముఖులను కలుసుకున్నా ఫలితం ఉండదు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయాల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. పారిశ్రామిక రంగంలోని వారికి సామాన్యం. విద్యార్థులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు మందకొడిగా సాగుతాయి.
 
మకరం :- ట్రాన్స్పోర్టు, ఎక్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రముఖలతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి నిరుత్సాహం తప్పదు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం :- ఆకస్మిక ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం అధికం. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
మీనం :- చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు, పనిభారం, చికాకులు తప్పవు. స్త్రీలకు వైద్యసలహా, ఔషధసేవనం తప్పదు. మీరు చేసే యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి.