బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-11-2022 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం..

Goddess Lakshmi
మేషం :- వన సమారాధనలు, శుభకార్యాల్లో హడావుడిగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇవ్వటం మంచిది కాదు. 
 
వృషభం :- భాగస్వామిక ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగాలి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. విదేశాల్లోనీ ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు.
 
మిథునం :- అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పెద్ద ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన వారికి సహచరులు సాదర వీడ్కోలు పలుకుతారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
కర్కాటకం :- వృత్తుల వారికి గుర్తింపు, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దమొత్తంలో ధనసహాయం చేసిఇబ్బందులెదుర్కుంటారు. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా పడతాయి. 
 
సింహం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో ఏకాగ్రత, మెళుకువ చాల అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య భంగం, ఔషధ సేవనం తప్పవు.
 
కన్య :- మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. విలువైన వస్తు కొనుగోళ్ళలో స్త్రీలకు అవగాహన ముఖ్యం.
 
తుల :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. నిరుద్యోగులు వచ్చిన అవకాశం చిన్నదైనా సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆప్తులకు వివాహ సమాచారం అందిస్తారు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం : మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. చిన్నచిన్న తప్పిదాలు దొర్లే సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
 
ధనస్సు :- ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదుర్కుంటారు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి.
 
మకరం :- మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదుర్కుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాల అభివృద్ధికి అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కుంభం :- స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు.
 
మీనం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. వ్యాపారాల్లో మొహమ్మాటాలు తావివ్వటం మంచిది కాదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ శ్రీమతి, సంతానం కోరికలు తీర్చేందుకు యత్నించండి.