గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (23:13 IST)

20-11-2022 నుంచి 26-11-2022 వరకు మీ రాశిఫలాలు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఓర్పుతో వ్యవహరించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు చేపడతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు కష్టకాలం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అజ్ఞాత వ్యక్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం మీ శ్రీమతికి తెలియజేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. ఆది, గురువారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆరోగ్య, ఆధ్మాత్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
మీ కృషి ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేసే ఆస్కారం లేదు. శనివారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్నవ్యాపారులకు నిరాశాజనకం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
అన్ని రంగాల వారికీ శుభదాయకమే. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. సోమ, మంగళవారాల్లో పనుల ప్రారంభంలో అవాంతరాలెదురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి వ్యవహరాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆరోగ్యం బాగుంటుంది. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు ఆశించిన ఫలితమిస్తాయి. అవివాహితులు శుభవార్తలు వింటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. రిటైర్డు అధికారులు, ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పొగిడేవారితో జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురు, శుక్రవారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది, నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలించదు. ఆశావహదృక్పథంతో మెలగండి. త్వరలో శుభవార్తలు వింటారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీ శుభదాయకమే. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవద్దు. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితమిస్తాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆత్మస్థైర్యంతో మెలగండి. సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. అతిగా ఆలోచింపవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆప్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి సలహా పాటించండి. శనివారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఆది, సోమవారాల్లో అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను ఆప్తుల ద్వారా తెలియజేయండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆధ్మాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణ సమస్యలు తొలగుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. వాస్తుదోష దోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. క్రీడికారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.