సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (09:41 IST)

25-06-2023 నుంచి 01-07-2023 వరకు మీ వార రాశిఫలాలు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. సన్నిహితుల సలహా పాటించండి. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయటంలో సందేహించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహ తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతగా మెలగాలి. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యవసాయ రంగాల వారికి కష్టసమయం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో నిరుత్సాహం తప్పదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. విత్తన వ్యాపారాలు ఊపందుకుంటాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష, 1, 2, 3, 4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. బుధవారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగాలి. సంతానం విజయం ఉత్తేజాన్నిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉన్నతాధికారులకు హోదా మార్పు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సాంకేతిక రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యవసాయ రంగాల వారికి అనుకూలదాయకం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆది, గురువారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. మీ వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా భావిస్తారు. పెద్దల జోక్యంతో సమస్యలు సానుకూలమవుతాయి. అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు తప్పవు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. విత్తన వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. సంస్థల స్థాపనకు, ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. ఎవరి సహాయం ఆశించవద్దు. అనుకూలతలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆది, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుంటారు. మీ సమర్థతపై నమ్మకం కుదురుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమవారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
వాస్తవ దృక్పథంతో మెలగండి. కొన్ని విషయాలు అనుకున్నట్టు జరుగవు. ఆలోచనలతతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆత్యీయుల కలయికతో కుదుటపడతారు. మంగళ, బుధవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. సంతానం విదేశీ విద్యాయత్నంలో ఆటంకాలెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. సంకల్పం సిద్ధిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
గ్రహాల అనుకూలత బాగుంది. అనుకున్నది సాధిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండీ. ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఈ వారం ఆశాజనకం. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి.