ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (20:11 IST)

04-06-2023 నుంచి 10-06-2023 వరకు వార రాశిఫలితాలు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పదవుల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు దూకుడు తగదు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అందరితో సత్సబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదామార్పు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మిథునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
శుభవార్తలు వింటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. బుధవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యవసాయ కార్మికులకు ఆశాజనకం. నూతన వ్యాపారాలు సంస్థల స్థాపనలకు తరుణం కాదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాద ములు
ఆశావహదృక్పధంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. విమర్శించిన వారే మీ సామర్ధ్యాన్ని గుర్తిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ఖర్చులు విపరీతం... ఒక ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సోమవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో సమస్యలెదురవుతాయ. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి, మీ పథకాలు మునుముందు సత్ఫలితమిస్తాయి. వాహనదారులకు దూకుడు తగదు. 
 
సింహం మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఈ వారం అనుదాయకం. కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. వివాహయత్నాలు ప్రారంభిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. వాస్తుదోష నివారణ అనివార్యం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. బంధుమిత్రుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. వ్యవసాయ కార్మికులకు పనులు లభిస్తాయి.
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
గ్రహబలం అనుకూలంగా ఉంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు బాధ్యతల మార్పు. వ్యవసాయ రంగాల వారికి ఆశాజకం ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాలు సాగిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. గురువారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవకసాలు అతికష్టంమీద నెరవేరుతాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. గృహంలో మార్పుచేర్పులు సత్ఫలితమిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆది, శుక్ర వారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వృత్తుల వారికి నిరాశాజనకం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు చేయాలనే ఆలోచన ఫలిస్తుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. శనివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. గృహమార్పు ఆశించిన ఫలితమిస్తుంది. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింగా శ్రమించాలి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. కార్మికులకు పనులు లభిస్తాయి. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రోజువారీ ఖరులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. సోమవారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
సంకల్పం నెరవేరుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతాన సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.