సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (11:54 IST)

4 నుంచి నర్సాపూర్ - యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు

train
నర్సాపూర్ - యశ్వంత్‌పూర్ ప్రాంతాల మధ్య ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. 07687, 07688 అనే నంబరుతో నడిచే రైలు నర్సాపూర్ నుంచి ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో 5వ తేదీన మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి నర్సాపూర్‌కు తర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. 
 
ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సారావు పేట, దొనకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం స్టేషన్లలో ఆగుతుందని, ఈ రైలులో ప్రయాణం చేయదలచిన వారు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపింది.