మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (12:21 IST)

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్‌కు స్పందన భేష్.. - 17 నుంచి 16 బోగీలతో పరుగులు

vande bharat express
సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుకు ప్రయాణికుల అపూర్వ స్పందన లభిస్తుంది. దీంతో ఈ రైలును ఈ నెల 17వ తేదీ నుంచి 16 బోగీలతో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే తగిన చర్యలు తీసుకుంది. అలాగే. ప్రయాణ వేళల్లో కూడా స్వల్ప మార్పులు చేసింది. 
 
ప్రస్తుంత ఈ రైలు 8 బోగీలతో నడుస్తుంది. ప్రయాణికుల స్పందన భారీగా ఉండటంతో వారి డిమాండ్ మేరకు ప్రస్తుతమున్న 8 బోగీలకు ఆదనంగా మరో 8 బోగీలను జత చేయనున్నట్లు ఇటీవలే రైల్వే శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సెమీ హైస్పీడ్ రైలులో బోగీలు రెట్టింపు కానున్నాయి. బోగీల సంఖ్య పెరగడంతో సీట్ల సంఖ్య కూడా 530 నుంచి 1036కి పెరగనుంది.
 
అలాగే సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు ప్రయాణ వేళల్లోనూ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుండగా.. 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయలుదేరనుంది. ఉదయం 7.30 గంటలకు నల్లగొండకు, 9.35 గంటలకు గుంటూరుకు, 11.09 గంటలకు ఒంగోలుకు, మధ్యాహ్నం 12.29 గంటలకు నెల్లూరుకు, అక్కడి నుంచి 2.30 గంటల వరకు తిరుపతికి చేరుకుంటుంది. 
 
అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, రాత్రి 11.30 గంటల వరకు సికింద్రాబాదు చేరుకోనుంది. ఈ రైలులో కేవలం 8.15 గంటల్లో గమ్యస్థానం చేరవచ్చు.