గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (10:30 IST)

గుంటూరు - కాచిగూడ రైలు మార్చి 28వ తేదీ వరకు రద్దు

train
వివిధ రకాలైన మరమ్మతులు కారణంగా ఆదివారం నుంచి గుంటూరు - కాచిగూడ ప్రాంతాల మధ్య నడిచే రైలును రద్దు చేశారు. ఈ నెల 28వతేదీ వరకు ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. కాచిగూడ - గుంటూరు రైలును ఆదివారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే, కాచిగూడ - మెదక్ రైలును రేపటి నుంచి మార్చి ఒకటోతేదీ వరకు, మెదక్ - కాచిగూడ రైలును రేపటి నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు దొనకొండ - గంటూరు మధ్య ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - డోన్ రైలు 12-28, డోన్ - గుంటూరు రైలును 13 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - తిరుపతి 19 నుంచి 28 వరకు, తిరుపతి - గుంటూరు రైలును, గుంటూరు - మార్కాపురం స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 
 
వీటితోపాటు మచిలీపట్నం - కర్నూలు సిటీ రైలును 14, 16, 18, 21, 23, 25, 28 తేదీల్లో, కర్నూలు సిటీ - మచిలీపట్నం రైలును 15, 17, 19, 22, 24, 26, మార్చి ఒకటో తేదీల్లో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌‍ప్రెస్ రైలును దొనకొండ - గంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు.