ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (10:40 IST)

జంటనగరాల పరిధిలో నేడు - రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

MMTS
తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాల పరిధిలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశారు. హైదరాబాద్ -సికింద్రాబాద్ పరిధిలో ట్రాక్ మెయింటెన్స్ ఆపరేషనల్ పనుల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఈ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.
 
రద్దు అయిన ఎంఎంటీఎస్ రైళ్లు లింగంపల్లి - నాంపల్లి మార్గంలో 2, నాంపల్లి - లింగంపల్లి మార్గంలో 3, ఫలక్‌నుమా - లింగంపల్లి రూట్‌లో ఐదు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. 
 
అలాగే, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఆరు సర్వీసులు, రాంచంద్రాపురం - ఫలక్‌నుమాలో ఒకటి, ఫలక్‌నుమా - రామచంద్రపురం మార్గంలో ఒకటి, ఫలక్‌నుమా - నాంపల్లి మార్గంలో 1 చొప్పున మొత్తం 19 రైళ్లను రద్దు చేసినట్టు ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.