గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:20 IST)

దేశంలో ఒకేసారి పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లు

Bharat Express
దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం కూడా మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను తిరిగి పట్టాలెక్కించారు. 
 
ఈ రెండు రైళ్లు ముంబై - షోలాపూర్, ముంబై - షిర్డీ మార్గాల్లో ప్రారంభించారు. ముంబై - షోలాపూర్ వందే భారత్ ట్రైన్ తొమ్మిదోది కాగా, ముంబై - షిర్డీ వందే భారత్ రైలు పదో రైలు. ఈ మార్గాల్లో ప్రయాణికులకు మరింత కనెక్టివిటీ కోసం ఈ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు వెళ్లారు. 
 
అలాగే, ముంబై మరోల్‌లో అల్జామియా - తుస్ - సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌ను కూడా మోడీ ప్రారంభించారు. ఇది దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రధాన విద్యా సంస్థగా వెలుగొందుతోంది.