గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (14:03 IST)

ఐపీఎల్ 2023 : మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు శుభవార్త.. ఏంటది?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు శుభవార్త. ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2023 కోసం అప్పుడే ధోనీ ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. మైదానంలో బ్యాటింగ్ తో పాటు కీపింగ్ ప్రాక్టీస్ తో చెమటోడ్చాడు. 
 
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహీ కేవలం ఐపీఎల్ లో మాత్రం ఆడుతుండటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
 
తాజాగా ఐపీఎల్ కోసం ఇప్పుడే  ప్రాక్టీస్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.