హైదరాబాద్ టు షోలాపూర్ - నేటి నుంచి ప్రత్యేక రైలు
హైదరాబాద్ - షోలాపూర్ మధ్య సోమవారం నుంచి ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లుచేసింది. ఈ రైలు వచ్చే నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైలును నడుపుతున్నారు. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నగరంలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు షోలాపూర్‌కు చేరుకుంటుంది.
మార్గమధ్యంలో బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి, గంగాపూర్ రోడ్, తిలాతి స్టేషన్ల మధ్య ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో షోలాపూర్‌లో మధ్యాహ్న 1.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.