గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (17:51 IST)

ఏజెంట్‌ వేడుకకు ప్రభాస్‌, రామ్‌చరణ్‌ రాకపోవడానికి కారణంఏమంటే!

prabhas,akil, charan
prabhas,akil, charan
అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఇది చూశాక చాలా మంచి బజ్‌ ఏర్పడింది. ఈసినిమాను ఈనెల 28న విడుదల చేస్తున్నారు. అయినా ఇంకా సాంకేతిక పనులు ఒక పక్క అవుతూనే వున్నాయి. మరోవైపు ప్రీరిలీజ్‌ వేడుకను రేపు చేయనున్నారు. ఇందుకు ప్రభాస్‌, రామ్‌చరణ్‌ వస్తున్నారని టాక్‌ వచ్చింది. దీనిపై అఖిల్‌ ఇలా వివరణ ఇచ్చారు.
 
ట్రైలర్‌ విడుదలయ్యాక ప్రభాస్‌, రామ్‌చరణ్‌ లు చూసి ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చారు. మహేష్‌ కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలో అందరూ చాలా బాగుందని అన్నారు. అయితే నేను ప్రభాస్‌, రామ్‌చరణ్‌ కానీ ఫంక్షన్‌కు రమ్మని అన్నమాట చెప్పనేలేదు. ఎలా వార్తలు రాస్తారో నాకే అర్థంకావడంలేదు అని చెప్పారు. ఇద్దరూప్రస్తుతం బిజీగా వున్నారు. మరి ముఖ్య అతిథి ఎవరనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు.