ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (10:28 IST)

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు మరో ఛాన్స్...

jhanvi kapoor
దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు తెలుగులో మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆమె కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నగరంలో సాగుతోంది. ఇపుడు మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించినట్టు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
 
చెర్రీ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను సంప్రదించగా, ఆమె దాదాపుగా ఓకె చెప్పినట్టు తెలుస్తుంది. అదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇద్దరు అగ్ర హీరోలైన ఎన్టీఆర్, చరణ్ సరసన నటించే అరుదైన అవకాశం వరించనుంది. చరణ్‌తో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇందులో చెర్రీ రెండు పాత్రల్లో నటిస్తాడని, ఒక హీరోయిన్‌గా జన్వీకపూర్, మరో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేస్తారే టాక్ వినిపిస్తుంది.