గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (19:09 IST)

పవిత్రమైన రంజాన్ రోజు మెగాస్టార్ ని కలవడం ఆనందం : అలీ

Megastar Chiranjeevi and Ali  brothers
Megastar Chiranjeevi and Ali brothers
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి  ప్రముఖ నటుడు అలీకి మరియు అలీ కుటుంబ సభ్యులకు రంజాన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముస్లిం సోదరులందరికి తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. నటుడు  అలి తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో  పంచుకోవడం ఎంతో అందంగా వుంది అన్నారు. అలీ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.
 
Qayyum, chiranjeevi, ali
Qayyum, chiranjeevi, ali
రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని అలీ అన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని అలీ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో అలీ మరియు ఆయన కుటుంబ సభ్యులు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.